అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా అనకాపల్లి జిల్లాలోని రైవాడ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మొత్తం 112 మీటర్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో, నీటిమట్టం ప్రస్తుతం 107 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం 2.744 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వస్తుండగా, విశాఖపట్నం నగర తాగునీటి అవసరాల నిమిత్తం అధికారులు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.