చంచల్‌గూడ జైలుకు మాజీ మంత్రి కారుమూరి

14చూసినవారు
చంచల్‌గూడ జైలుకు మాజీ మంత్రి కారుమూరి
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును తక్షణమే జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు అప్రమత్తమై, విజయవాడలో ఉన్న కారుమూరి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ప్రత్యేకంగా హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో తరలించి, చంచల్‌గూడ జైలు అధికారులకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

సంబంధిత పోస్ట్