AP: నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముందుగా ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు నోటీసులు అందజేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.