ఒకే ఇంట్లో నలుగురు సర్పంచులు

32చూసినవారు
ఒకే ఇంట్లో నలుగురు సర్పంచులు
AP: గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి కుటుంబం స్థానిక పాలనలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్వాతంత్య్రం తర్వాత శిరిగిరి కృష్ణయ్య ఉపసర్పంచిగా, కొంతకాలం సర్పంచిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన కుమారుడు వెంకయ్య 1964లో ఎన్నికై 1979 వరకు సర్పంచిగా కొనసాగారు. వెంకయ్య కుమారుడు వెంకట్రావు 1981లో సర్పంచిగా ఎన్నికయ్యారు. ఆయన భార్య రాధాకుమారి 2013లో సర్పంచిగా గెలుపొందారు. అంతేకాకుండా 2001 నుంచి నాలుగున్నరేళ్లపాటు ముప్పాళ్ల ఎంపీపీగా కూడా పనిచేశారు. ఇలా మూడు తరాలకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై గ్రామ, మండల అభివృద్ధిలో తమదైన ముద్ర వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్