AP: ఆధార్ కార్డును ప్రతి పదేళ్లకొకసారి అప్డేట్ చేసుకోవాలని UIDAI సూచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా క్యాంపులు నిర్వహిస్తోంది. సోమవారం నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. స్కూళ్లలో ఏర్పాటు చేసే శిబిరాలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచితంగా ఈ సేవలు పొందవచ్చు. ముఖ్యంగా 5 నుంచి 7 ఏళ్లు, 15 నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారు ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.