AP: కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే పాలనలో దూసుకుపోతున్నామని, అభివృద్ధి, సంక్షేమం తమ విధానమని సీఎం చంద్రబాబు తెలిపారు. మొగల్తూరులో మంగళవారం
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజల కోసమే కూటమి పార్టీలు ఏకమయ్యాయని, సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో రూ.1.50 కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశామని, పెన్షన్ల రూపంలో రూ.73వేల కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏసీ బస్సులు వస్తాయని, వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.