AP: పల్నాడు జిల్లా వినుకొండలో శుక్రవారం ఒక ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా ఫ్రిడ్జ్ పేలిపోయింది. ఈ భారీ శబ్దంతో అప్రమత్తమైన గృహిణి, వెంటనే స్పందించి గ్యాస్ స్టవ్ ఆపివేయడంతో పాటు, గ్యాస్ సిలిండర్ను సురక్షితంగా బయటకు తరలించింది. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చి భారీ ప్రాణనష్టం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మహిళ సకాలంలో స్పందించడంతో పెను ముప్పు తప్పినట్లయింది.