త్వరలోనే పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన: జగన్

31చూసినవారు
త్వరలోనే పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన: జగన్
AP: వైసీపీ అధినేత జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, నాయకులతో జగన్ సమావేశమయ్యారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురు నాయకుల వ్యవహార శైలిపై జగన్ సీరియస్ అయ్యారు. నియోజకవర్గాల్లో ఏం జరిగిందో చిట్టా తన దగ్గర ఉందని, జైల్లో పెట్టినప్పటికీ ప్రజలు పెళ్లకూరు ZPTCగా సత్యనారాయణ రెడ్డిని గెలిపించారన్నారు.

సంబంధిత పోస్ట్