పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

30చూసినవారు
పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
AP: ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలంలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. బొత్తప్పగూడెం-అంకన్నగూడెం మార్గంలో పులి తిరుగుతూ ఒక ఆవుపై దాడి చేసి చంపేసింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. పశువులను కాపాడేందుకు రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి పులి కదలికలపై నిఘా పెంచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్