కార్మికులకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా హెల్త్ టెస్టులు

9చూసినవారు
కార్మికులకు గుడ్‌న్యూస్.. ఫ్రీగా హెల్త్ టెస్టులు
ఏపీలో కార్మిక శాఖలో నమోదైన భవన, ఇతర నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు విడతల్లో 13.38 లక్షల మందికి 18 రకాల స్క్రీనింగ్‌ పరీక్షలు చేయనున్నారు. ఒక్కొక్కరిపై రూ.2,620 చొప్పున మొత్తం రూ.349 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అనారోగ్య సమస్యలు గుర్తించిన వారిని ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తారు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి రెండో ఏడాదీ పరీక్షలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్