రెండు విడతల డీఏ విడుదల చేసిన ప్రభుత్వం

71చూసినవారు
రెండు విడతల డీఏ విడుదల చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు తీపి కబురు అందించింది. ఉద్యోగ వర్గాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండు విడతల కరువు భత్యం (డీఏ)ను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, 2024 జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా 2.73 శాతం డీఏను, అలాగే 2025 జనవరి 1వ తేదీ నుంచి వర్తించేలా మరో 1.82 శాతం డీఏను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు విడతల డీఏల విడుదలతో ఉద్యోగుల కరువు భత్యం మొత్తం 4.55 శాతం మేర పెరిగి, ఉద్యోగుల నెలవారీ జీతాలు, పింఛన్లలో సానుకూల మార్పు రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్