AP: మన్యం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల నీట మునిగింది. వీరఘట్టం మండలం చిట్టపులివలస ప్రభుత్వ పాఠశాలలో వరద నీరు చేరింది. భారీ వర్షం కురవడంతో పాఠశాల ప్రాంగణం మొత్తం జలమయం అయింది. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలోకి నీరు చేరడంతో సోమవారం తరగతికి వచ్చిన
విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్కూల్లో మధ్యాహ్న భోజనానికి ఉంచిన బియ్యం తడిసిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు.