బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు

8చూసినవారు
బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు
AP: బియ్యం ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా బియ్యం రకాలకు అనుగుణంగా కిలో రూ.47 నుంచి రూ.82 వరకు గరిష్ఠ విక్రయ ధరలు నియంత్రించింది. బీపీటీ-3291(సోనా), బీపీటీ-5204(సాంబా), కేఎన్ఎం రకాల బియ్యం కిలో ధర రూ.66గా నిర్ణయించింది. జైశ్రీరామ్ రకం ధర రూ.82, హెఎంటీ, ఆర్ఎన్ఆర్ రూ.76, ఎంటీయూ సాధారణ రకాలు రూ.47కి లభించనున్నాయి. ఈ ధరలకు మించి మార్కెట్‌లో బియ్యం విక్రయించవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్