ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా గ్రూప్-2 సర్వీసెస్ కింద భర్తీ చేయనున్న 720 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువు డిసెంబరు 11తో ముగియనుంది. ఇందులో డిప్యూటీ తహశీల్దార్, ఎండీవో, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 21న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అభ్యర్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంది. దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకుని ప్రిపరేషన్ను వేగవంతం చేయాలని సూచించడమైనది.