ఏలూరు జడ్పీ పీఠంపై పెరుగుతున్న పోటీ

17చూసినవారు
ఏలూరు జడ్పీ పీఠంపై పెరుగుతున్న పోటీ
AP: ఏలూరు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవిపై పోటీ పెరుగుతోంది. ఈ పదవిని తమకు కేటాయించాలని కోరుతూ మాజీ ఎంపీ మాగంటి బాబు దంపతులు ఎంపీ పుట్టా మహేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుమార్తె నవ్యశ్రీ కూడా పుట్టా మహేశ్‌తో భేటీ అయి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించాలని కోరారు. దీంతో జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్