గుడివాడ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత

24చూసినవారు
గుడివాడ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
AP: కృష్ణా జిల్లాలోని గుడివాడ 28వ వార్డులో ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విలీన గ్రామం బొమ్ములూరులో ఎమ్మెల్యే రాము, కూటమి అభ్యర్థులు రోడ్ షో నిర్వహిస్తుండగా, మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్ నేతృత్వంలోని వైసీపీ బృందం అకస్మాత్తుగా ఆ ర్యాలీలోకి ప్రవేశించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న కూటమి ర్యాలీని వైసీపీ వర్గం అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్