AP: పులివెందులలో గణేష్ విగ్రహం వద్ద
టీడీపీ నాయకులైన పుష్పనాథ్రెడ్డి, విజయ్రెడ్డిల మధ్య స్థానిక వివాదం కారణంగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో విజయ్రెడ్డి, పుష్పనాథ్రెడ్డిపై చేయి చేసుకోవడంతో ఇరువర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ క్రమంలో విజయ్కుమార్రెడ్డి ఇంటి వద్ద ఉన్న మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన హజ్ కమిటీ డైరెక్టర్ భాషా వద్దకు వెళ్లినప్పుడు, ఆయన గన్మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరపడంతో స్థానికంగా కలకలం రేగింది.