
భర్త దాడిలో గాయపడ్డ మహిళ మృతి
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చురులో శుక్రవారం రాత్రి అనుమానంతో భర్త వసంత రాయుడు కత్తితో దాడి చేయడంతో భార్య వీరనారాయణమ్మ (30) తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఆమె చికిత్స పొందుతూ గుంటూరు సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. మృతురాలి తల్లి బ్రహ్మేశ్వరమ్మ కూడా శనివారం రాత్రి అల్లుడి చేతిలో జరిగిన దాడిలోనే అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.





















