
జిల్లాస్థాయి అథ్లెటిక్స్లో బాలికల పాఠశాల విద్యార్థినుల సత్తా
బాపట్ల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్ 14 విభాగంలో కె షర్మిల ప్రథమ స్థానం సాధించి, అక్టోబర్ ఒకటి, రెండు తేదీలలో కర్నూలులో జరగబోయే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో బాపట్ల జిల్లా తరఫున పాల్గొనేందుకు ఎంపికైంది. ఈ సందర్భంగా బుధవారం వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది విద్యార్థినికి అభినందనలు తెలిపారు.

































