బాపట్ల మండలం - Bapatla Mandal

పెద్దపల్లి జిల్లా
దులికట్టలో భవాని మాతకు ప్రత్యేక పూజలు
Oct 15, 2026, 11:10 IST/పెద్దపల్లి
పెద్దపల్లి

దులికట్టలో భవాని మాతకు ప్రత్యేక పూజలు

Oct 15, 2026, 11:10 IST
పెద్దపల్లి జిల్లా దులికట్ట గ్రామంలో శ్రీ దుర్గా శివ గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో నెలకొల్పబడిన దుర్గాదేవి మండపం వద్ద గురువారం కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, భవాని మాత ఆశీస్సులతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివ గణేష్ భక్త మండల యూత్ సభ్యులు, వార్డు సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.