Oct 09, 2026, 14:10 IST/
అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి రోగి సజీవదహనం
Oct 09, 2026, 14:10 IST
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఉదాల మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగిని మరో ఆసుపత్రికి తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌లో సిద్ధం చేశారు. అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్‌ను ఆన్ చేయగానే అది పేలి, మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రోగి సజీవదహనం కాగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.