
దళిత బాలుడిపై దాడి: చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదు
మార్టూరులో 12 ఏళ్ల దళిత బాలుడు బొల్లాపల్లి అభిషేక్పై సెప్టెంబర్ 10న జరిగిన దాడిపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసి 18 రోజులు గడిచినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ సోమవారం మార్టూరులో ధర్నా నిర్వహించి, ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. బాలుడికి రక్షణ, చట్టపరమైన పరిహారం కల్పించాలని వారు కోరారు.































