
గుంటూరు జిల్లా కోర్టులో దొంగతనం కలకలం
గుంటూరులోని ఫోక్సో కోర్టులో దొంగతనం జరిగింది. కోర్టు తాళాలు పగలగొట్టి, రూ.14,000 నగదును దొంగిలించారు. సమీపంలోని అమ్మవారి దేవాలయంలోని హుండీని కూడా దొంగిలించి, రైలు పట్టాలపై వదిలేశారు. ఈ ఘటనపై కోర్టు అధికారులు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఫోరెన్సిక్ అధికారులు బుధవారం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన జిల్లా కోర్టులో కలకలం రేపింది.


































