గుంటూరు జిల్లా న్యాయస్థానం వద్ద బుధవారం మాల న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తూ జరిగిన భారత్ బంద్ లో మాల న్యాయవాదులు పాల్గొని తమ నిరసన గళాన్ని విప్పారు. ఈ సందర్భంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రభుత్వాలు కుల, మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదమ్ములుగా ఉన్న తమ మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం సమంజసం కాదని అన్నారు.