గురజాల - Gurazala

జానపాడులో దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలి: పిడిఎం

జానపాడులో దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలి: పిడిఎం

పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో మాల కులస్తులపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పిడిఎం నాయకులు డిమాండ్ చేశారు. దాడిలో గాయపడి నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కోడిరెక్క హేమంత్ తదితరులను వారు పరామర్శించారు. ఈ నెల 17న వినాయకుడి ఊరేగింపు సందర్భంగా డీజే శబ్దం తగ్గించాలని కోరినందుకు కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయకపోతే అన్ని సంఘాలను కలుపుకుని ఉద్యమిస్తామని పిడిఎం నాయకులు హెచ్చరించారు.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా
Top 10 viral news 🔥
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!
Sep 30, 2026, 17:09 IST/

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.21,000ల బోనస్!

Sep 30, 2026, 17:09 IST
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పెంపుపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగ సంఘాలు బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.7,000 నుండి రూ.21,000కి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, ఉద్యోగులకు రూ.20,724 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే, కొన్ని విభాగాల్లో రోజులు తగ్గించి బోనస్ ఇవ్వడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.