Oct 01, 2026, 10:10 IST/
రేవంత్ అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చారు: కేటీఆర్
Oct 01, 2026, 10:10 IST
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని, కానీ వాటిని నిరూపించలేకపోయారని ఆరోపించారు. సచివాలయం నిర్మాణం, ప్రగతి భవన్, కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులపై కాంగ్రెస్ చేసిన ప్రచారాలు అబద్ధాలని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మూడేళ్లు గడిచినా ఒక్క ఆరోపణను కూడా కాంగ్రెస్ నిజమని తేల్చలేకపోయిందని ఎద్దేవా చేశారు.