Oct 15, 2026, 09:10 IST/
సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సమ్మె.. NHM ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన హరీశ్ రావు
Oct 15, 2026, 09:10 IST
TG: సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మెకు గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంఘీభావం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. NHM, ఆయుష్ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.