
వివిఐటియూలో ‘ఇష్రే’ విద్యార్థి విభాగం ప్రారంభం
గుంటూరు, పొన్నూరు, మంగళగిరిలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఇష్రే’ విద్యార్థి విభాగాన్నిమంగళవారం ప్రారంభించారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక అనుభవం పెంపొందించేందుకు వివిఐటియూ–ఇష్రే మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా సర్టిఫికెట్ కోర్సులు, ఇండస్ట్రియల్ విజిట్స్, సాంకేతిక సదస్సులు, వర్క్షాప్లు, ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

































