Sep 03, 2026, 15:09 IST/
ఆటో, బైక్ ఢీ.. ముగ్గురు యువకులు మృతి
Sep 03, 2026, 15:09 IST
AP: కాకినాడ జిల్లాలోని తాళ్ళరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. మట్లపాలెం గ్రామం వద్ద వేగంగా వస్తున్న ఆటో, బైక్ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కృష్ణ, మణికంఠ, తమ్మి అనే ముగ్గురు యువకులు బైక్పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణ, మణికంఠ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన తమ్మిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను కూడా మరణించాడు.