
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నరసరావుపేట నుంచి రొంపిచర్ల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని చెక్ పోస్టు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.





































