Oct 08, 2026, 17:10 IST/
సీఈసీ జ్ఞానేష్ రాజీనామా చేయాలి: సీఎం రేవంత్
Oct 08, 2026, 17:10 IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భాష పేరుతో ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ ప్రయత్నించారని, ఈడీ, సీబీఐలను ఉపయోగించి నెగ్గేందుకు చూశారని ఆరోపించారు. ఇప్పుడు 13 కోట్ల ఓట్లను తొలగించారని, బ్రిటిష్ వారు సైమన్ కమిషన్ను వాడితే, బీజేపీ ఎన్నికల కమిషన్ను వాడుతోందని విమర్శించారు. భగత్ సింగ్, రాహుల్ గాంధీలు దేశం కోసం పోరాడుతున్నారని, ఇది కాంగ్రెస్ సమస్య కాదని, దేశ ప్రజల సమస్య అని అన్నారు. సీఈసీపై మోదీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.