
అందుకూరు : జెడ్పీ ఉన్నత పాఠశాలలో SMC ఎన్నికలు
క్రోసూరు మండలం అందుకూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కోటేశ్వరి చైర్మన్గా, సిద్ధల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, SMC సభ్యుల మద్దతుతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ తాళ్లూరి వాసు, దిగుమర్తి తిరుమలరావు, ప్రసాద్, దుగ్గి రవి, కే. వెంకయ్య, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు డి. ధర్మారావు పర్యవేక్షించారు.




































