
బ్రాహ్మణకోడూరు సచివాలయానికి రూ.2 లక్షల డిజిటల్ పరికరాలు అందజేత
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామ పంచాయతీ ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు రూ. 2 లక్షల విలువైన డిజిటల్ పరికరాలను గ్రామ సచివాలయానికి అందజేశారు. డా. రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్, రామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పరికరాలను అందించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ గ్రామ ప్రజల తరఫున రామినేని ధర్మ ప్రచారక్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MPDO గుమ్మడి చంద్రశేఖర్, EO&PRD శ్రీనివాసరావు, పంచాయతీ సిబ్బంది, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ పరికరాల ద్వారా సేవలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నారు.


































