Sep 29, 2026, 13:09 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
శ్రీరాంపూర్లో దివ్యాంగ పిల్లలకు క్రీడా పోటీలు
Sep 29, 2026, 13:09 IST
పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం మండల స్థాయి క్రీడోత్సవాలలో భాగంగా దివ్యాంగ పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథి, మండల విద్యాధికారి మహేష్ మాట్లాడుతూ, దివ్యాంగ పిల్లలకు క్రీడలు నిర్వహించడం అభినందనీయమని, తల్లిదండ్రులు వారిని సాధారణ పిల్లలతో సమానంగా చూసి ప్రోత్సహించాలని కోరారు. గెలుపొందిన పిల్లలకు మెమెంటో, మెడల్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో SCXHM కె. వెంకటేష్, MPPS పాఠశాల PSHM అత్తె రాజారాం, మండల IERP సుమలత, స్పెషల్ ఎడ్యుకేటర్ వనజ, మోడల్ స్కూల్ PET బాలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.