
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన - ఎస్సై సూచనలు
నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సోషల్ మీడియా వాడకంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెరుకుపల్లి ఎస్సై కందుల కృష్ణ తిరుపతి రావు సూచించారు. రాజోలు జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి, చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 హెల్ప్లైన్కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.




















