Sep 09, 2026, 10:09 IST/
E-20 పెట్రోల్తో వాహనాలు పాడవుతున్నట్లు ఆధారాల్లేవు: మంత్రి పొన్నం
Sep 09, 2026, 10:09 IST
TG: E20 పెట్రోల్ తో వాహనాలు పాడవుతున్నాయనే వార్తల్లో నిజం లేదని, దీనిపై రవాణా శాఖకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో తెలిపారు. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త వాహనాలకు E20 ధృవీకరణ తప్పనిసరి అని, మైలేజ్ కాస్త తగ్గినా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు ఈ విధానం ఎంతో మేలు చేస్తుందన్నారు. E20 ఇంధనం, ఇథనాల్ పరిశ్రమల వల్ల కాలుష్యం వస్తుందనే అపోహలను తొలగించేందుకు రవాణా శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు.