
నూతన ఎస్పీని కలిసిన లోక్ జనశక్తి పార్టీ నాయకులు
పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె. జగదీష్ అదహళ్లిని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్ప మొక్కను అందజేసి, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఆయన వెంట ఆర్యవైశ్య సంఘం పట్టణ మాజీ అధ్యక్షులు మద్ది వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, రవి కుమార్ తదితరులున్నారు.
























