Oct 09, 2026, 17:10 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
గాయత్రి విద్యానికేతన్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Oct 09, 2026, 17:10 IST
పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి విద్యానికేతన్ హైస్కూల్లో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు. గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను, తెలంగాణ సంస్కృతిలో దాని స్థానాన్ని వివరించారు. మహిళలు తమ జీవితంలోని కష్టసుఖాలను ప్రతిబింబించే పాటలు పాడుతూ పూలతో బతుకమ్మలను పేర్చి ఆడుకునే సంప్రదాయాన్ని ఆయన గుర్తు చేశారు.