
చీకటి గోపి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ కమిషన్
తాడికొండ మండలం కొనేకల్లు గ్రామానికి చెందిన దళిత యువకుడు చీకటి గోపి పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటనపై ఎస్సీ కమిషన్ స్పందించింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ కె. ఎస్. జవహర్, సభ్యులు రావాడ సీతారాం, దళిత ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగ కొనేకల్లు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్నిమంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యుల ఆవేదనను తెలుసుకుని, గోపి మృతిపై వారి అనుమానాలు, ఆరోపణలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని కమిషన్ హామీ ఇచ్చింది.






















