Sep 09, 2026, 15:09 IST/
కాలం కలిసి వస్తే నేను సీఎం అవుతానేమో: ఎమ్మెల్యే మల్లారెడ్డి (VIDEO)
Sep 09, 2026, 15:09 IST
TG: దేవుడు సంకల్పిస్తే ఏదైనా సాధ్యమేనని, భవిష్యత్తులో తాను కూడా సీఎం కావచ్చునని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకుని తలనీలాలు సమర్పించిన ఆయన.. మేడ్చల్ ప్రజల ఆదరణను జీవితాంతం మరచిపోలేనని తెలిపారు. తన 74వ జన్మదినం సందర్భంగా తిరుమల నుంచి తిరిగొచ్చిన మల్లారెడ్డికి మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.