
విద్యారంగంలో విశిష్ట గుర్తింపు. .డా.RAJU కు టీచర్ అవార్డు
గుంటూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో తెనాలిలోని వెస్ట్బరీ CBSE స్కూల్లో ఎకనామిక్స్ టీచర్గా పనిచేస్తున్న డాక్టర్ వి.ఎన్. రాజుకు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్–2026లో “బెస్ట్ టీచర్ అవార్డు” లభించింది. టీచర్స్ హబ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు. ఎకనామిక్స్ బోధనలో విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడంలో ఆయన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది.





















