సిపిఐ కార్యాలయంలో నిరాహారదీక్షలు

372చూసినవారు
రాష్ట్రంలో విలయతాండవం చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనాను కట్టడి చేయడంలో పాలక ప్రభుత్వాలు విఫలం చెందాయని సిపిఐ రేపల్లె ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ ఆరోపించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి పిలుపు మేరకు సిపిఐ కార్యాలయంలో నిరసన దీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ప్రాణాలు గాలిలో కలసిపోతున్న పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలక ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్ లను కొనుగోలు చేసి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలో ఉచిత వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని సత్వరమే వైద్యసేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని బాలాజీ డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలో సిపిఐ, ఎఐటియుసి నాయకులు ఓబులశెట్టి రమేష్, టి. రఘరాం ప్రసాద్, వి. చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్