కోల్లూరులో టీడీపీ అభ్యర్థి గెలుపు

4308చూసినవారు
కోల్లూరులో టీడీపీ అభ్యర్థి గెలుపు
గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కోల్లూరులో జరిగిన పంచాయతీ ఎన్నికలలో టీడీపీ బలపర్చిన కోల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామావతి విజయ ప్రత్యర్థి పై 1098 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 18 వార్డులు ఉండగా అందులో టీడీపీ బలపర్చిన వార్డు అభ్యర్థుల్లో 4, 5, 6, 7, 9, 10, 12, 13, 14, 15, 17, వార్డుల అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 11 వార్డులు టీడీపీ గెలుపొందింది. వైసీపీ బలపర్చిన వార్డు అభ్యర్దుల్లో 2,16,18వ వార్డు అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 3 వార్డులు వైసీపీ గెలుపొందింది. జనసేన బలపర్చిన వార్డు అభ్యర్థులో 1, 8,11 వ వార్డు అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 3 వార్డులు జనసేన గెలుపొందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్