
సంగం డైరీ ఆధ్వర్యంలో రైతులకు ప్రోత్సాహం
పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల మండలంలో, గోగులపాడు MPWS సెంటర్లో శుక్రవారం సంగం డెయిరీ ఆధ్వర్యంలో సూపర్ నేపియర్ సాగు చేసిన పాల ఉత్పత్తిదారులకు రూ. 35,000 విలువైన చెక్కులను అందజేశారు. పశువులకు నాణ్యమైన పచ్చిమేత అందించి, పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాడి రైతుల ఖర్చులు తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో సంగం డెయిరీ అధికారులు N. V. కిరణ్ కుమార్, Ch. కృష్ణారెడ్డి, సంఘ అధ్యక్షులు K. సాంబశివరావు మరియు రైతులు పాల్గొన్నారు.






























