
గుంటూరులో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై దాడి
గుంటూరులో పాత గుంటూరు ప్రాంతంలో డాల్డా, వనస్పతి, క్రీమ్తో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో 70 కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. మరో 100 కిలోల వనస్పతి, క్రీమ్ నిల్వలను కూడా గుర్తించారు. ఈ కల్తీ నెయ్యిని బిర్యానీ పాయింట్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ చదలవాడ హరిబాబు సమాచారం మేరకు ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను పరీక్షలకు పంపించి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.



































