
ఐసీసీ ఛైర్మన్గా జై షా ఎన్నిక: నారా లోకేశ్ అభినందనలు
బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఐసీసీ ఛైర్మన్గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ డైరెక్టర్ల ప్రతిపాదన మేరకు ఈ నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. జై షా ఎన్నిక క్రికెట్ ప్రపంచం ఆయనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని, ఇది భారతదేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో జై షా విజయం సాధించాలని లోకేశ్ తన సందేశంలో ఆకాంక్షించారు.
































