
ఆహార నిర్వహణ యాప్‌కు ప్రథమ బహుమతి
కర్ణాటకలోని మల్నాడ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన 'ఆవిష్కార్ మంథాన్' పోటీల్లో గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వివిఐటీయూ విద్యార్థులు సత్తా చాటారు. ఆహార వ్యర్థాల నిర్వహణ కోసం బి. అభిషేక్, పవన్, బొగేష్ మణికంఠల బృందం రూపొందించిన ప్రత్యేక యాప్‌కు ప్రథమ బహుమతి లభించింది. దేశవ్యాప్తంగా 22 బృందాలు పోటీపడగా, మిగిలిపోయిన ఆహారాన్ని పేదలకు చేరవేసే ఈ ఆలోచన అద్భుతమని ప్రశంసలు దక్కాయి. విజేతలను కళాశాల యాజమాన్యం శనివారం అభినందించింది.


































