తాడికొండ - Vellore

బాల్య వివాహం వద్దు - బాలల భవిష్యత్తును కాపాడుదాం !

బాల్య వివాహం వద్దు - బాలల భవిష్యత్తును కాపాడుదాం !

ఫిరంగిపురం మండలంలోని మేరికపూడి అంగన్వాడీ కేంద్రంలో గురువారం బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పల్లపాటి లింగరాజు యాదవ్ మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలు, గర్భం దాల్చడం వల్ల తల్లీబిడ్డలకు రక్తహీనత, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే బాల్య వివాహాల వల్ల విద్యకు ఆటంకం, మానసిక ఒత్తిడి, సామాజిక సమస్యలు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా