
కొల్లిపర మండలం లో రెండవ రోజు ఎంపీటీసీ నామినేషన్ల సందడి
గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని కొల్లిపర మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. శుక్రవారం జరిగిన రెండో రోజు నామినేషన్ల ప్రక్రియతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొదటి రోజు 25 నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు 58 నామినేషన్లు సమర్పించారు. వీటిలో వైఎస్ఆర్సిపి 46, టిడిపి 21, జనసేన 9, స్వతంత్ర అభ్యర్థులు మరియు ఇతర పార్టీల వారు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీలన్నీ తమ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి.


































