AP: పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ Haier భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడులో 250 ఎకరాల్లో రూ.7,000 కోట్లతో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ద్వారా 21 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2032 నాటికి ప్రాజెక్టు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.